Celebrations turns to Tragedy: దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా జెండా వందనం ఏర్పాట్లు చేస్తుండగా అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. జెండా కర్రకు విద్యుత్‌ తీగలు తగిలాయి. విద్యుత్‌ సరఫరా జరగడంతో జెండా కర్ర వద్ద ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ములుగు జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ములుగు పట్టణంలోని ఎస్సీ కాలనీలో స్థానిక యువకులు జెండా వందనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో జెండా కర్రగా ఇనుప రాడ్‌ ఏర్పాటుచేస్తుండగా ఆ కర్రకు విద్యుత్‌ తీగలు తగిలాయి. కర్ర పట్టుకున్న బొడ అంకిత్ కుమార్, ల్యాడ విజయ్, బోడ కల్యాణ్ చక్రి విద్యుదాఘాతానికి గురయ్యారు. ఇనుప రాడ్‌కు విద్యుత్‌ సరఫరా కావడంతో ఆ ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలైన బొడ అంకిత్ కుమార్, ల్యాడ విజయ్ అక్కడికక్కడే మరణించగా.. కల్యాణ్ చక్రి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 


హుటాహుటిన స్థానికులు వారిని ములుగులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి సీతక్క బాధిత  కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. తక్షణ సహాయంగా రూ.10 వేలు అందించారు. గాయపడిన కల్యాణ్‌ చక్రికి మెరుగైన  వైద్యం అందించాలని సీతక్క వైద్యులను కోరారు.

Also Read: KTR Republic Day: గవర్నర్‌ తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్‌ ఫెవికాల్‌ బంధమంటూ వ్యాఖ్యలు


Also Read: KTR Viral Tweet: సంచలనం రేపుతోన్న కేటీఆర్ ట్విట్టర్ పోస్ట్.. రాష్ట్రరాజకీయాల్లో తీవ్రచర్చ..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook